తిరుమల శ్రీవారిని సభాపతి తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్ నిర్ణయాలను ప్రజలు హర్షిస్తుంటే.. ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శిస్తున్నారని సభాపతి మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు అంటే తమకు గౌరవం ఉందన్న సభాపతి తమ్మినేని.. ప్రతిపక్షనేతగా సలహాలివ్వాలి కానీ విమర్శించడం తగదని సూచించారు.
ప్రతిపక్షనేతగా చంద్రబాబు సలహాలివ్వాలి.. విమర్శించడం తగదు: తమ్మినేని - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమ్మినేని సీతారాం
తిరుమల శ్రీవారిని స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రతిపక్షనేతగా సలహాలివ్వాలి కానీ విమర్శించడం తగదని సూచించారు.
speaker