చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నగరిలో పర్యటించారు. కొవిడ్ నిబంధనలు.. లాక్ డౌన్‌ను పోలీసులు అమలు పరుస్తున్న విధివిధానాలను సీఐ మధ్యయచారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు కరోనా పేషెంట్లకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. లాక్ డౌన్ ప్రభావంతో కేసులు కాస్త తగ్గుముఖాయం పట్టినట్టు చెప్పారు.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలకు, వ్యాపారులకు అనుమతి ఉందని.. అనంతరం కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బయటికి వచ్చే వారు మాస్కూలు ధరించాలని, శానిటైజర్ తప్పకుండా వాడాలని, అనవసరంగా ఎవరు బయటకు రావద్దని ఆయన సూచించారు.