చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్.. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని రాయల్ చెరువు గేట్ అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. రూ.15 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పనులు 75% పూర్తయ్యాయని మరో 25 శాతం సెప్టెంబర్‌లోగా పూర్తి చేస్తామని చెప్పారు. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి విమానాశ్రయం వైపు వెళ్లేందుకు అన్ని మౌలిక సదుపాయాలతో రెండో ముఖద్వారం ఏర్పాటు చేయనున్నట్లు జనరల్ మేనేజర్ గజానన్ మల్యా తెలిపారు.
'రైల్వేస్టేషన్ నుంచి విమానాశ్రయం వైపు వెళ్లేందుకు రెండో ముఖద్వారం' - Gajanan, General Manager, South Central Railway, visits Chittoor district
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి విమానాశ్రయం వైపు వెళ్లేందుకు అన్ని మౌలిక సదుపాయాలతో రెండో ముఖద్వారం ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా తెలిపారు.
రాయల్ చెరువు గేట్ అండర్ బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్నదక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా