ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sonu sood: మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్ - సోనూసూద్ తాజా వార్తలు

నటుడు సోనూసూద్(Sonu sood) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. చిత్తూరులో ఓ కరోనా రోగికి సాయపడాలంటూ సందేశం పంపిన 8 గంటల్లోనే.. ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ పంపి.. తన మంచితనాన్ని నిరూపించుకున్నారు.

sonu sood
మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్

By

Published : Jun 1, 2021, 10:43 PM IST

సినీ నటుడు సోనూసూద్‌(sonu sood) మరోసారి తన దాతృత్వాన్ని చాటారు. కరోనా రోగికి సాయపడాలంటూ సందేశం పంపిన 8 గంటల్లోనే.. సహాయం అందేలా చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

బాధితునికి ఆక్సిజన్ కాన్సన్​ట్రైటర్ పంపిన సోనూనూద్

చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంటలో.. ధనుంజయులు అనే వ్యక్తికి కరోనా సోకి కాన్సన్​ట్రేటర్ అవసరం పడింది. దీంతో కుప్పంకు చెందిన యువ కళాకారుడు పురుషోత్తం.. ధనంజయలు పరిస్థితిని సోనుసూద్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో సోనూసూద్ చిత్రాలు గీసి, ఆయన నుంచి నేరుగా ప్రశంసలు అందుకున్న పురుషోత్తం.. సహాయం అడిగిన వెంటనే స్పందించారు. సాయంత్రానికల్లా గ్రామానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్​ను సోను సూద్ బృందం చేరవేసింది. ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ సమయానికి గ్రామానికి చేరుకున్నా.. అప్పటికే ధనుంజయులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. స్థానికుల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అడిగిన వెంటనే స్పందించి ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ పంపిన సోనూసూద్ ఉదారతను గ్రామస్థులు కొనియాడుతున్నారు.

ఇదీ చదవండి:అమెరికా తెలుగు అసోసియేషన్ దాతృత్వం: 50 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు అందజేత

ABOUT THE AUTHOR

...view details