ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి కరువై... పోషణ భారమై - couple living in bad situevation news

ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు లాక్​డౌన్​ కారణంగా దుర్భర జీవితం గడుపుతున్నారు. చేసేందుకు పనిలేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ లాక్​డౌన్​ కారణంగా పేదరికానికి బలి ఆయ్యింది. మరో బిడ్డను కాపాడుకోలేక మానసిక క్షోభను అనుభవిస్తూ దాతల సహాయం కోసం ఎదురు చుస్తున్నారీ దంపతులు.

sonia, shakir couple
దాతల సాయం కోసం అర్థిస్తున్న సోనియా, షాకీర్‌ దంపతులు

By

Published : May 1, 2020, 6:58 PM IST

కందూరు రోడ్డులో నివాసముంటున్న షాకీర్‌, సోనియా దంపతులు ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ వివాహం నచ్చక వారి తరఫు పెద్దలు దూరమయ్యారు. కూలి పనులు చేసి షాకీర్‌ అద్దె ఇంటిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయిదు నెలల కిందట ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇంతలోనే లాక్‌డౌన్‌తో కూలిపనులు లేక, కనీసం రేషన్‌కార్డు లేక పూట గడవడం అతి కష్టమైంది. 20 రోజుల కిందట బిడ్డ మదీనాకు విరేచనాలు కావడంతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ను రూ.700కు అమ్మి ఆసుపత్రిలో చూపించారు. కానీ బిడ్డ ప్రాణం కాపాడుకోలేకపోయారు. బిడ్డ మృతితో మానసిక క్షోభలో ఉన్న సోనియాకు పాలు నిలిచిపోయాయి. ఇంకో పాపకైనా పాలు కొని తాగించడానికి డబ్బులు లేవని వాపోతోంది ఆ తల్లి. ఇల్లు గడిచేందుకు రూ.20వేల వరకు అప్పులు కాగా... అప్పిచ్చిన వాళ్లు నిలదీయడం వారిని మరింత విషాదంలోకి నెట్టింది. తమ దీనస్థితిని చూసి దాతలు ఆర్థికంగా ఆదుకోవాలని, అధికారులు రేషన్‌కార్డు ఇప్పించాలని కోరుతున్నారు. ఎవరూ ఆదుకోకుంటే తాము, తమ బిడ్డకు పస్తులే గతి అని చెబుతున్నారు షాకీర్‌ దంపతులు.

ఇవీ చూడండి..

తిరుమలలో వన్యప్రాణుల సంచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details