చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు కుటుంబానికి ట్రాక్టర్ పంపి అండగా నిలిచిన రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్‌ను మాజీమంత్రి సోమిరెడ్డి అభినందించారు. ఇకపై సోనూసూద్‌ను విలన్‌గా చూడలేనన్న సోమిరెడ్డి...సినిమాల్లో హీరో పాత్ర వేయాల్సిందేనని కోరారు. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశామన్న ఆయన...ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదని కొనియాడారు. వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్,విద్యార్థులు స్వదేశం రావడంలో సోన్ సూద్ చొరవ అభినందనీయమన్నారు.
'విలన్‌గా చూడలేం.. హీరో పాత్ర వేయాల్సిందే' - sonu soodh gift tractor to farmer
సోనూ సూద్ దాతృత్వాన్ని మాజీమంత్రి సోమిరెడ్డి కొనియాడారు. చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు కుటుంబానికి ట్రాక్టర్ పంపి అండగా నిలిచి సోనూసూద్ రియర్ హీరో అయ్యారని మెచ్చుకున్నారు. ఇకపై సోనూసూద్‌ను విలన్‌గా చూడలేనని ...సినిమాల్లో హీరో పాత్ర వేయాల్సిందేనని విజ్ఞప్తి చేశారు.

సోనూ సూద్‌పై సోమిరెడ్డి