ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కానిస్టేబుల్ సెల్వీ మృతదేహానికి ఘన నివాళి - మహిళా కానిస్టేబుల్ సెల్వీ మృతి

తిరుపతిలో విషాదం జరిగింది. నగరంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ కరోనా కారణంగా మృతిచెందారు. ఆమె మృతదేహానికి తిరుపతి అర్బన్​ పోలీసులు ఘనంగా నివాళులర్పించారు.

Solid tributes to the body of Constable Selvi in thirupathi
కానిస్టేబుల్ సెల్వీ మృతదేహానికి ఘన నివాళులు

By

Published : Jul 30, 2020, 8:28 AM IST

తిరుపతిలో కరోనాతో పోరాడుతూ.. మహిళా కానిస్టేబుల్ సెల్వీ మృతి చెందింది. ఆమె మృతదేహానికి.. తిరుపతి అర్బన్ పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో.. అమరవీరుల స్తూపం వద్ద తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్​రెడ్డి.. పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. శోకసంద్రంలో ఉన్న సెల్వీ కుటుంబాన్ని ఓదార్చారు.

1991 బ్యాచ్​కు చెందిన సెల్వీ... అలిపిరి పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు కరోనా సోకడంతో స్విమ్స్ లో చికిత్స పొందుతూ మంగళ వారం సాయంత్రం మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details