ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రానికి చిత్తూరు వీరజవాన్ ప్రవీణ్ పార్థివ దేహం - chittor latest news

కశ్మీర్​లో వీరమరణం పొందిన చిత్తూరుకు చెందిన జవాన్ ప్రవీణ్​కుమార్ రెడ్డి పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలించారు. తెలంగాణ జవాన్ మహేశ్ పార్థీవదేహన్ని సైతం అతని స్వగ్రామానికి తరలించారు.

SOLDIERS DEAD BODIES
స్వస్థలానికి చిత్తూరు వీరజవాన్ పార్థివ దేహం

By

Published : Nov 10, 2020, 10:30 PM IST

స్వస్థలానికి చిత్తూరు వీరజవాన్ పార్థివ దేహం

కశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్​కుమార్ రెడ్డి పార్థివదేహం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అంతకుముందు.. జవాన్ ప్రవీణ్ తో పాటు.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో అమర జవాన్ మహేష్ పార్థీవదేహాలను.. జమ్ముకశ్మీర్ నుంచి హైదరాబాద్​లోని బేగంపేట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. ఆ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌, నార్త్‌జోన్‌ డీసీపీ కమలేశ్వర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి చిత్తూరుకు చెందిన వీరజవాన్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్థివదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. ప్రత్యేక అంబులెన్స్​లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి మహేశ్​ పార్థీవదేహాన్నితరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details