హైదరాబాద్కు చెందిన లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. యాత్రసదన్ వద్దకు చేరుకున్న లోకేశ్ కారులో...పాము ఎక్కడాన్ని భక్తులు గమనించారు.వెంటనే కారును నిలిపివేశారు. పాము ఎంతకీ బయటకు రాకపోవటంతో పాములు పట్టే నైపుణ్యం గల తితిదే ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారం ఇచ్చారు. అరగంట పాటు శ్రమించి పామును సురక్షితంగా బయటకు తీశారు. ఏడు అడుగుల పొడవున్న పామును సంచిలో తీసుకెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పామును బయటకు తీస్తున్నంత సేపూ.. జనాలంతా.. ఉత్కంఠతో చూశారు.
తిరుమలలో కారులో దూరిన పాము.. భక్తుల కంగారు.. - హైదరాబాద్కు చెందిన లోకేశ్
తిరుమల కొండల్లో నుంచి వచ్చిన ఓ పాము అక్కడ ఆగిఉన్న కారులోకి వెళ్లింది.. చూస్తుండగానే కింది నుంచి బోయెనెట్ లోకి వెళ్లింది... ఆ తర్వాత ఏమైందంటే..!?
![తిరుమలలో కారులో దూరిన పాము.. భక్తుల కంగారు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3686648-907-3686648-1561711622254.jpg)
తిరుమలలో కారులో ఇరుక్కుపోయిన పామును తీస్తున్న తితిదే అధికారి
తిరుమలలో కారులో ఇరుక్కుపోయిన పామును తీస్తున్న తితిదే అధికారి
ఇవి కూడా చదవండి.. ఆయనకు కాలిక్యూలెటర్ అక్కర్లేదు!
Last Updated : Jun 28, 2019, 3:23 PM IST