ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టాస్క్​ఫోర్స్​ సిబ్బందిపై స్మగ్లర్ల రాళ్ల దాడి - smugglers attack on taskforce police in seshachalam forest

చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లోని శేషాచలం అడవుల్లో... ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్​ఫోర్స్​ సిబ్బందిపై రాళ్లదాడి చేశారు.

టాస్క్​ఫోర్స్​ సిబ్బంది రాళ్లు రువ్విన స్మగ్లర్లు
టాస్క్​ఫోర్స్​ సిబ్బంది రాళ్లు రువ్విన స్మగ్లర్లు

By

Published : Dec 24, 2019, 7:50 PM IST

టాస్క్​ఫోర్స్​ సిబ్బందిపై స్మగ్లర్ల రాళ్ల దాడి

తిరుపతి పరిసర ప్రాంతాల్లో టాస్క్​ఫోర్స్ నిఘా పెరిగింది. దీంతో ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. స్మగ్లర్లు జాడలపై టాస్క్​ఫోర్స్ సిబ్బంది పడమటి మండలాలపై దృష్టిసారించారు. మంగళవారం ఉదయం 2 గంటల సమయంలో రెడ్డివారిపల్లె వద్ద అనుమానాస్పదంగా ఓ వాహనం కనిపించింది. టాస్క్​ఫోర్స్​ సిబ్బంది వెంబడించి... ఆ కారును చుట్టుముట్టారు.

ఆ సమయంలో నలుగురు స్మగ్లర్లు సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన టాస్క్​ఫోర్స్ సిబ్బంది​ వారిని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. 30 దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులు తెలిపారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details