చిత్తూరు జిల్లా మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో వారపు సంతలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని చిన్న వ్యాపారులు నిరసన చేశారు. పురపాలక సంఘం కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. వీరికి మద్దతుగా సీపీఐ, సీపీఎం, బీసీ ప్రజా సంఘాలు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నాయి. వారపు సంతలో కొంతమంది బడా వ్యాపారులు చట్టవిరుద్ధంగా షెడ్లు నిర్మించుకొని ఆక్రమించుకున్నారని వారు అన్నారు. చిరు వ్యాపారులను వ్యాపారం చేసుకొనివ్వకుండా ...పెద్ద వ్యాపారులు అభ్యంతరం తెలుపుతున్నారని వాపోయారు. తక్షణమే మున్సిపాలిటి అధికారులు ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.
మదనపల్లె పురపాలక సంఘం కార్యాలయం ఎదుట చిరు వ్యాపారుల ధర్నా - మదనపల్లెలో చిరువ్యాపారుల ఆందోళన వార్తలు
చిత్తూరు జిల్లా మదనపల్లె పురపాలక సంఘంలోని చిరు వ్యాపారులు ధర్నా నిర్వహించారు. వారపుసంతలో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు.
మదనపల్లె