చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం బసవరాజు కండ్రిగలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో శిశువు మృతదేహం కలకలం రేపింది. మృత దేహాన్ని కుక్కలు పీక్కు తింటుండగా గమనించిన స్థానికులు... మృత శిశువును ఖననం చేశారు. వ్యాపారం నిమిత్తం గ్రామానికి వచ్చిన ముగ్గురు మహిళలే మృతిచెందిన శిశువును పడేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు.
దారుణం.. ముళ్లపొదల్లో శిశువు మృతదేహం
కనికరం లేకుండా కన్నబిడ్డను ముళ్ల పొదల్లో పడేసిన దారుణ ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం బసవరాజు కండ్రిగ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం బసవరాజు కండ్రిగలో శిశువు మృతదేహం