ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హుషారుగా సాగుతున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు - sixth day matches at tirupathi

'ఈనాడు' క్రీడా పోటీలు ఆద్యంతం హుషారుగా సాగుతున్నాయి. తుమ్మలగుంట వైఎస్సార్ క్రీడా మైదానంలో జరుగుతున్న పోటీలు నేటితో ఆరో రోజుకు చేరాయి.

sixth day matches at tirupathi
ఆరో రోజుకు చేరిన ఈనాడు క్రీడా పోటీలు

By

Published : Dec 25, 2019, 12:35 PM IST

హుషారుగా సాగుతున్న 'ఈనాడు' క్రీడా పోటీలు

తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడామైదానంలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ పోటీలకు అంబేడ్కర్ గ్లోబల్ లా ఇనిస్టిట్యూట్ చైర్మన్ తిప్పారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని వెలికితీసి... ప్రోత్సహిస్తున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఆటలను ప్రారంభించారు.

జూనియర్, సీనియర్స్ విభాగంలో 8 జట్లు విజేతలుగా నిలిచాయి. ఎస్​వీసీ ఇంజినీరింగ్ కాలేజీ కరకంబాడి, ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ తిరుపతి, ఎమరాల్డ్ జూనియర్ కాలేజీ రామాపురం, ఎస్​వీయూ కాలేజ్​ ఆఫ్ సైన్స్ తిరుపతి, ఎస్వి జూనియర్ కాలేజ్ తిరుపతి, ఎమరాల్డ్ డిగ్రీ కాలేజ్ తిరుపతి, విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీ ఏ.రంగంపేట, ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కాలేజీ తిరుపతి జట్లు విజేతలుగా నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details