రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నా... ఇసుకాసురులు తమ అక్రమ రవాణాను ఆపడం లేదు. చిత్తూరు జిల్లా స్వర్ణముఖి వాగు పరీవాహక ప్రాంతాల్లోని రైతులు...ఇసుక రవాణా జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మండలంలోని శానంపట్ల పంచాయతీలో దాడి చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 16 ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించి మైనింగ్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.
ఇసుక అక్రమంగా తరలిస్తోన్న 16 ట్రాక్టర్లు సీజ్ - చిత్తూరులో అక్రమంగా తరలిస్తున్న 16 ఇసుక ట్రాక్టర్ల సీజ్
చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 16 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
![ఇసుక అక్రమంగా తరలిస్తోన్న 16 ట్రాక్టర్లు సీజ్ sixteen illegally moving sand tractors gets ceazed at chittor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5391544-193-5391544-1576498098997.jpg)
చిత్తూరులో అక్రమంగా తరలిస్తున్న 16 ఇసుక ట్రాక్టర్ల సీజ్
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత.. ట్రాక్టర్లు సీజ్