UKG Boy Complaint on Traffic Problems: ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ ఓ బుడతడు.. సీఐని కోరాడు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఆదర్శ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల కార్తికేయ.. తమ స్కూల్ దగ్గర తలెత్తిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. స్కూల్ దగ్గర జేసీబీతో రోడ్డు తవ్వేసి ట్రాక్టర్లను అడ్డుగా పెట్టారని సీఐకి తెలిపారు.
పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆరేళ్ల బుడతడు... సమస్యేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! - వైరల్ వీడియో
UKG Boy Complaint on Traffic Problems: ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ ఓ 6ఏళ్ల బుడతడు పోలీస్ స్టేషన్ మెట్లేక్కాడు. తమ స్కూల్ దగ్గర రోడ్డు తవ్వి ట్రాక్టర్లను అడ్డు పెట్టారని.. దీంతో తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఐకి తెలిపారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ బుడతడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
six year boy Complaint on traffic problem
మీరందరూ వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయండని కోరడంతో.. సీఐ భాస్కర్ ఎస్సైలు నాగరాజు సుబ్బారెడ్డిలు బాలుడితో సరదాగా కాసేపు ముచ్చటించారు. సీఐ భాస్కర్ తాము అందరూ వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని బాలుడికి తెలిపారు. బాలుడికి స్వీట్ తినిపించిన సీఐ భాస్కర్.. తన ఫోన్ నెంబర్ కార్తికేయకు ఇచ్చారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ బుడతడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి:రాళ్లు రువ్వుకుంటూ 'ఊరంతా' హోలీ.. 48 మందికి గాయాలు