చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ముంగిలిపుట్టు వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కల్వర్టు గోడను లగేజీ ఆటో ఢీ కొట్టింది. పూతలపట్టు మండలంలోని రంగంపేట క్రాస్ నుంచి తిరుపతికి తాటికాయలు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. రహదారిపై సరైన భద్రతాప్రమాణాలు పాటించని కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కల్వర్టును ఢీ కొట్టిన ఆటో... డ్రైవర్‌కు తీవ్ర గాయాలు - poothalapattu-nayudupeta highway
చిత్తూరు జిల్లా పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. తాటికాయల లోడ్‌తో వెళ్తున్న ఆటో.. ముంగిలిపుట్టు వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
![కల్వర్టును ఢీ కొట్టిన ఆటో... డ్రైవర్‌కు తీవ్ర గాయాలు road accident at mungiliputtu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11449154-1002-11449154-1618741072163.jpg)
కల్వర్టును ఢీ కొట్టిన ఆటో