చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం డీఆర్ఎన్ కండ్రిగ అరుణ గిరిపై వెలసిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత ఆలయంలో శివరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుటుంబ సభ్యులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముక్కంటి సేవలో భాగంగా ఆలయం వద్ద భక్తుల గాన కచేరి ఆహుతులను అలరించింది. వేడుకలకు విచ్చేసిన అశేష భక్త జనావళికి ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేసింది.
వెదురుకుప్పం అరుణగిరిలో వైభవంగా శివరాత్రి వేడుకలు - temples rush due to sivaratri in chittore
మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు శివయ్య దర్శనం కోసం బారులు తీరారు. స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
వెదురుకుప్పం అరుణగిరిలో వైభవంగా శివరాత్రి వేడుకలు
TAGGED:
sivaratri celebrations