తమ్ముడు మృతిని తట్టుకోలేక అక్క మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. నెల్లూరులో సెషన్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (ఫస్ట్‌క్లాస్ కోర్టు)గా పని చేస్తున్న షేక్ అతిక్ అహ్మద్ (52) ఆయన నివాసంలో ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. శ్రీకాళహస్తిలో నివాసం ఉంటున్న ఆయన సోదరి షాబీనా బేగం(56), తమ్ముడి మరణ వార్త విని గుండెపోటుతో మృతి చెందారు. మరణంలోనూ అక్క, తమ్ముళ్ల ఆత్మీయ బంధం వీడలేదని బంధువులు అంటున్నారు.
ఆత్మీయ బంధం... మరణంలోనూ వీడలేదు - శ్రీకాళహస్తిలో తమ్ముడి మరణం వార్త విని అక్క మృతి
తమ్ముడు మరణ వార్త విన్న అక్క తనువు చాలించింది. తమ్ముడితో తన బంధాన్ని వీడనని తనతో వెళ్లిపోయింది. నెల్లూరుకు చెందిన షేక్ అతిక్ అహ్మద్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. తమ్ముడి మృతి విషయం తెలిసిన ఆయన సోదరి గుండెపోటులో మృతిచెందారు. మరణంలోనూ వీరి బంధం వీడలేదని బంధువులు అంటున్నారు.
ఆత్మీయ బంధం... మరణంలోనూ వీడలేదు