చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ విద్యాప్రకాశానందగిరి ఆశ్రమమైన శుక బ్రహ్మాశ్రమంలో ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఏకాంతంగా వీటిని నిర్వహించాలని ఆరాధన ఉత్సవ సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా.. అధిష్టాన మందిరంలో వెలసిన స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. అలాగే ఈ నెల 29న 108వ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి 108 కలశాలతో అభిషేకాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.
శుక బ్రహ్మాశ్రమంలో ఘనంగా ఆరాధనోత్సవాలు - శుక బ్రహ్మాశ్రమ ఆరాధనోత్సవాలు తాజా సమాచారం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమంలో ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా ఏకాంతంగా వీటిని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శుక బ్రహ్మాశ్రమ ఆరాధనోత్సవాలు