ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''ఈనాడు-సీఎంఆర్'' ఆధ్వర్యంలో శ్రావణ మహోత్సవం - ఈనాడు-సీఎంఆర్

తిరుపతి నగరంలో ఈనాడు-సీఎంఆర్ ఆధ్వర్యంలో శ్రావణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణ, బ్యూటిఫుల్ స్మైల్, ఫోటో జెనిక్ ఫేస్, ర్యాంప్ వాక్ తదితర విభాగాల్లో మహిళలకు పోటీలు నిర్వహించారు.

తిరుపతిలో ఈనాడు-సీఎంఆర్ ఆధ్వర్యంలో శ్రావణ మహోత్సవం

By

Published : Aug 4, 2019, 7:43 PM IST

తిరుపతిలో ఈనాడు-సీఎంఆర్ ఆధ్వర్యంలో శ్రావణ మహోత్స

ఈనాడు-సీఎంఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహించిన శ్రావణ మహోత్సవ వేడుక తిరుపతిలో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. నగరంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్​లో మహిళలకు సంప్రదాయ వస్త్రధారణ, బ్యూటిఫుల్ స్మైల్, ఫోటో జెనిక్ ఫేస్, ర్యాంప్ వాక్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన మహిళలకు బహుమతులు అందచేశారు. సంస్కృతీ, సంప్రదాయాల విశిష్ఠత తెలియచేసేలా... ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆకెళ్ల విభీషణ శర్మ శ్రావణ మాస వైశిష్ట్యాన్ని మహిళలకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details