చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ధూర్జటి కళాప్రాంగణంలో ప్రముఖ సినీ వాయిద్య కళాకారుడు డ్రమ్స్ శివమణి చే వాయిద్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ వాయిద్యాల ఒకేసారి వాయిస్తూ శివమణి భక్తులను అలరించారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చిన సంగీత ప్రియులతోకళాప్రాంగణం జనసంద్రంగా మారింది. ప్రదర్శన అనంతరం మాట్లాడిన శివమణి...జన్మనిచ్చిన తల్లికి పద్మశ్రీ అవార్డును అంకింతం చేసినట్లు తెలిపారు.శివ లీలలు ఎంతో మహిమగలవని, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రంలో వాయిద్యాలు ప్రదర్శించడం జన్మ జన్మల పుణ్య ఫలమనిఅన్నారు. తల్లి, తండ్రి, గురువుల ఆశీస్సులతోనే ఉత్తమ కళాకారుడిగా గుర్తింపుపొందినట్లు తెలిపారు.