ఇదీ చదవండి:
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి - shivaji birtha anniversary at kilikiri
చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో.. ఛత్రపతి శివాజీ 390వ జయంతిని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ మత సంరక్షణకు, సామ్రాజ్య స్థాపనకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. సమావేశం అనంతరం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో యువకులు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి