ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శాస్త్రోక్తంగా శయనోత్సవం.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముగింపు

By

Published : Mar 19, 2021, 10:27 AM IST

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేపట్టారు. ఆలయ అనువంశిక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ ఆధ్వర్యంలో.. శాస్త్రోక్తంగా శయనోత్సవం జరిపించారు. ప్రత్యేక పుష్పాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబయిన మండపంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.

Shayanotsavam
శాస్త్రోక్తంగా శయనోత్సవం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా శయనోత్సవం రమణీయంగా జరిగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణ చేపట్టారు. వెండి పల్లకీలో చంద్రశేఖర్ స్వామి, ఉమాదేవిలు.. శయనోత్సవ మండపానికి తరలివచ్చారు. ప్రత్యేక పుష్పాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబయిన మండపంలో దేవతామూర్తులకు సుగంధ పరిమళాలు వెదజల్లే యాలకులు, లవంగాలతోపాటుగా.. జీడిపప్పు, బాదం పప్పు వంటివాటితో ప్రత్యేకంగా మాలలు తయారు చేశారు. ఆలయ అనువంశిక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా శయనోత్సవం జరిపి.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details