ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఐపై మహిళ ఫిర్యాదు.. లైంగిక వేధింపుల కేసు నమోదు

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో ఎస్ఈబీ సీఐ మోహన్​పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నాలుగేళ్లుగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంపై... ఎస్ఐ శ్వేత కేసు నమోదు చేశారు.

Woman harassment case
లైంగిక వేధింపుల కేసు

By

Published : Aug 10, 2021, 4:02 PM IST

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట బీసీ కాలనీకి చెందిన పి.శారద.. వ్యవసాయ కూలీ, దళిత, గిరిజ సంఘాల్లో సభ్యురాలిగా ఉన్నారు. సభ్యుల సమస్యలపై ఆమె తరచూ అధికారులను కలిసేవారు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల క్రితం ఎస్టీ సంఘాల ద్వారా బి.కొత్తకోట ఎస్ఈబీ సీఐగా పనిచేస్తున్న మోహన్.. చిత్తూరు కలెక్టరేట్ వద్ద పరిచయమయ్యారు.

సంఘాల ద్వారా ఆమె ఫోన్​నెంబరు తీసుకుని అసభ్య పదజాలంతో మాట్లాడేవాడు. ఆమె వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఫోన్ చేయలేదు. తాజాగా తన భర్త, పిల్లలు లేని సమయంలో ఫోన్​చేసి ఇంటి వద్దకు వస్తున్నానని చెప్పి భయాందోళనకు గురిచేస్తున్నారని స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల నుంచి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఎస్ఈబీ సీఐపై 354 డీ, 509 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు భాకరాపేట ఎస్ఐ శ్వేత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details