ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులపై రాళ్లదాడి... పలువురికి గాయాలు - పోలీసులపై రాళ్లదాడి పలువురికి గాయాలు న్యూస్

సమయం ముగిసినా చిత్తూరు జిల్లా కొంగాటం పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచార కొనసాగిస్తుండడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సర్పంచ్ అభ్యర్థి వర్గీయులు, పోలీసులపై రాళ్ల దాడి జరిపారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

Several policemen were injured in the stone pelting in kongatam panchayat, v.kota mandal, Chittoor District
పోలీసులపై రాళ్లదాడి... పలువురికి గాయాలు...

By

Published : Feb 15, 2021, 10:44 PM IST

చిత్తూరు జిల్లా వి. కోట మండలం కొంగాటం పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచార సమయం ముగిసినా కొనసాగిస్తుండడంతో.. పోలీసులు ప్రచారాన్ని ఆపాలని కోరారు. స్థానిక నాయకులు మాట వినకపోవడంతో.. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రెచ్చిపోయిన సర్పంచ్ అభ్యర్థి జయరామిరెడ్డి వర్గీయులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని వి. కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలి'

ABOUT THE AUTHOR

...view details