Three girls died after falling into pond: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి కోనేరులో దిగిన ప్రమాదవశాత్తు ముగ్గురు బాలికలు మృతి చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. దేవదొడ్డి గ్రామానికి చెందిన కదిరివేలు కుటుంబం తమ బంధువులతో కలిసి ఆ గ్రామంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామి ఆలయానికి పూజల కోసం వెళ్లారు. కదిరివేలు కుమార్తె గౌతమి.. తమ బంధువులు మౌనిక, భవ్యలతో కలిసి సమీపంలోని కోనేరు వద్దకు వెళ్ళి సరదాగా ఆడుకుంటున్నారు. అయితే ప్రమాదవశాత్తూ వారు ముగ్గురూ నీటిలో మునిగిపోయి మృతి చెందారు.
తల్లిదండ్రులు ఆలయంలో దేవునికి నైవేథ్యం పెడుతున్న సమయంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత పిల్లలు కనబడకపోవటం గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. అయితే ముగ్గురు పిల్లలు కోనేటిలో ఉండటం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతరం పిల్లలను కోనేటిలో నుంచి బయటకు తీసి హుటాహుటిన బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పిల్లలను పరీక్షించి వైద్యలు.. అప్పటికే వారు మృతి చెందినట్లు తెలిపారు.
కోనేరులో పడి ముగ్గురు బాలికలు.. రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి.. - తిరుపాడు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం
Three girls died after falling into pond: కోనేరులో దిగిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తూ అందులో మునిగిపోయి మృతి చెందారు. ఈ విషాదకరం ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. మరోవైపు నంద్యాల జిల్లాలోని ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..
కాగా మౌనిక, భవ్య ఇద్దరూ తమిళనాడు రాష్ట్రంలోని పేర్నంపట్టుకు చెందిన ఆరవట్ల గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో గౌతమి, మౌనిక ఇద్దరి వయస్సు 14 సంవత్సరాలు. కాగా.. భవ్యకు 16 సంవత్సరాల వయస్సు ఉంటుందని సమాచారం. ఈ విషాదకర ఘటనతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. నంద్యాల జిల్లా గడివేముల మండలం తిరుపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా వచ్చిన కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పెద్ద గోతిలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఇలియాజ్(60) అనే వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నర్సింహులు(40) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.