ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సహకార చక్కెర పరిశ్రమ.. పునరుద్ధరణ జరిగేనా! - ఏపీలో మాతపడ్డ చక్కెర కర్మాగారాల వార్తలు

ప్రజలకు తీపి పంచే చెరకు రైతులు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. పండిన పంటకు మద్దతు ధర లేక, ప్రైవేటు పంచన చేరాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలు కొన్ని మూతపడటం... మరికొన్ని ఆ దిశగా పయనిస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మూతపడిన సహకార చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఖాయిలా పడిన పరిశ్రమలను పరిశీలించడంతో అన్నదాతల్లో ఆశలు నెలకొన్నాయి.

seven  Cooperative sugar factories shut down in andhrapradesh
seven Cooperative sugar factories shut down in andhrapradesh

By

Published : Dec 23, 2019, 9:18 PM IST

సహకార చెక్కెర పరిశ్రమ..పునరుద్ధరణ జరిగేనా!
వాణిజ్య పంటలు...దేశంలో రైతుకు ఆదాయం తెచ్చి పెట్టేవి. వాటిలో పత్తి ప్రధానమైన ఆదాయ వనరు కాగా...ఆ తర్వాతి స్థానం చెరకు పంటదే. అలాంటి పంట ద్వారా చక్కెర ఉత్పత్తి చేస్తూ ఎన్నో ప్రైవేట్ పరిశ్రమలు లాభాలు గడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 527 చక్కెర పరిశ్రమలు ఉండగా.. వాటిలో 24 ఆంధ్రప్రదేశ్​లో ఉన్నాయి. ఉత్పత్తి విషయానికొచ్చేసరికి దేశవ్యాప్తంగా 24.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంటే... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మిలియన్‌ టన్నుల చక్కెర ఉత్పత్తి జరుగుతోంది. కానీ అన్నదాత ఆర్జిస్తోంది మాత్రం శూన్యమే.

నష్టాల బాటలో రైతన్నలు..
సహకార రంగంలోని పరిశ్రమలు మూతపడటం... ప్రైవేటు చక్కెర పరిశ్రమలు రైతులకు దన్నుగా నిలవకపోవడంతో చెరకు పంట పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిర్దేశించిన మద్దతు ధర అందక...ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యాలు పంట కొనుగోలులో పెట్టే అంక్షల నడుమ రైతుకు కష్టాలు తప్పడం లేదు.

పదకొండులో నాలుగు మాత్రమే..
రాష్ట్రంలో సహకారం రంగంలో పదకొండు చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో రెండు, నెల్లూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున చక్కెర కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని సహకార పరిశ్రమల్లో విశాఖ జిల్లాలోని చోడవరం, ఏటికొప్పాక, తాండవ విజయనగరం జిల్లాలో ఓ పరిశ్రమ ఉత్పత్తిలో ఉండగా... మిగిలిన ఏడు ఖాయిలా పడ్డాయి. సహకార రంగంలో చక్కెర పరిశ్రమలు విజయవంతంగా నడిచే సమయంలో చెరకు పంట సాగుచేసే రైతులు ఆశించిన మేర లాభాలు గడించారు. సహకార పరిశ్రమలు మూతపడటంతో ప్రైవేటు పరిశ్రమలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక చిత్తూరు జిల్లాలోనే సహకార రంగంలోని రెండు చక్కెర కర్మాగారాలపైనే దాదాపు 20 వేల మంది ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అవి కాస్తా మూతపడటంతో గడచిన మూడేళ్లలో రైతులు, కార్మికులు పడని వెతలు అంటూ లేవు.

భారం లేకుండానే రుణ సాయం
సహకార రంగంలో చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు గతంలో ఏర్పాటైన రంగరాజన్‌ కమిటీ పలు సిఫారసులు చేసింది. కానీ అలాంటి సిఫార్సులేవీ రాష్ట్రంలో అమలు కాకపోడవంతో చక్కెర పరిశ్రమలు ఖాయిలా దిశగా సాగాయి. వాస్తవానికి కేంద్రం అందించే రుణాల సాయంతో మూతపడ్డ పరిశ్రమలను తిరిగి అందుబాటులోకి తీసుకురావొచ్చు.

  • మొత్తం ఆధునీకరణ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని జాతీయ సహకార అభివృద్ది సంస్థ(ఎన్​సీడీసీ) నుంచి రుణంగా పొందవచ్చు
  • చెరకు పిప్పి ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రంలోని మినిష్టరీ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ (ఎమ్​ఎన్​ఈఎస్​) నుంచి రాయితీతో కూడిన రుణం అందుబాటులో ఉంది.
  • ప్లాంటు ఆధునీకరణకు చక్కెర అభివృద్ది నిధి(ఎస్​డీఎఫ్)నుంచి కేవలం 4 శాతం వడ్డీకే రుణం పొందే వీలుంది.
  • మొత్తం ప్లాంటు విస్తరణలో 70 శాతం వరకు ఎస్డీఎఫ్ నుంచి రుణం తీసుకోవచ్చు.
  • రైతులు, కర్మాగార యాజమాన్యం, ప్రభుత్వం మొత్తం వ్యయంలో పది శాతం భరిస్తే 90 శాతం వరకు రుణాలుగా సమకూరుతాయి.

ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడకుండానే మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించే అవకాశం ఉంది.

సహకార రంగంలో ఏర్పాటైన చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించే లక్ష్యంతో ఏర్పాటైన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోంది. పరిశ్రమల పునరుద్దరణకు ఉన్న అవకాశాలు పరిశీలించడంతో పాటు సహకార పరిశ్రమలపై రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో మూతపడిన ఏడు సహకార పరిశ్రమల్లో తొలి విడతలో తిరుపతి, కడప పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ కష్టాలు తీరాలంటే.. కార్మికులకు ఉపాధి దొరకాలంటే తప్పనిసరిగా మూతపడ్డ సహకార రంగ చక్కెర పరిశ్రమలను అందుబాటులోకి తీసుకురావాలని రైతన్నలు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి : "కేబినెట్ నిర్ణయం తర్వాత రాజధానులపై స్పందిస్తాం"

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details