తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల - seva_tickets
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి 67 వేల 737 టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. మొత్తం 67 వేల 737 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్టు తితిదే ఈవో సింఘాల్ తెలిపారు. 11 వేల 412 సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లక్కీ డిప్ విధానానికి కేటాయించారు. డిప్ పద్ధతిలో టికెట్ల నమోదుకు నాలుగు రోజుల సమయమిచ్చారు. సాధారణ పద్ధతిలో విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవాలకు , సహస్రదీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలకు కలిపి 56 వేల 325 టికెట్లు అందుబాటులో ఉంచారు. టికెట్ల జారీలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేదని సింఘాల్ తెలిపారు.