ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

13 మందికి సేవారత్న పురస్కారాలు - సేవ రత్న అవార్డుల ప్రధానోత్సవం

చిత్తూరు జిల్లాలోని ఫైన్​ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సేవా రత్న పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

కరాటే చేస్తున్న విద్యార్థులు

By

Published : Aug 12, 2019, 10:11 AM IST

కరాటే చేస్తున్న విద్యార్థులు

గాన గంధర్వుడు ఘంటసాల జయంతి సందర్భంగా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సేవారత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లె కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ శ్రీనివాసులు అన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలను కళల వైపు ప్రోత్సహిస్తే... వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా సంస్కృతిని వెలికితీయడానికి ఇది ఒక చక్కటి వేదికగా ఆయన అభివర్ణించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో చూపరులను ఆకట్టుకున్నారు. పలు రంగాల్లో సేవలందించిన 13 మందికి సేవారత్న పురస్కారాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details