చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో 7వ రాష్ట్ర స్థాయి సీనియర్ కుస్తీ (రెజ్లింగ్) పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఒలంపిక్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఆంజనేయులు నాయుడు ప్రారంభించారు.
తిరుపతిలో సీనియర్ల కుస్తీ పోటీలు ప్రారంభం - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
తిరుపతిలో 7వ రాష్ట్ర స్థాయి సీనియర్ కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. మెుదటి రోజు సీనియర్ మహిళలకు, రెండవ రోజు సీనియర్ పురుషులకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వీటిని నిర్వహించనున్నారు.
తిరుపతిలో ప్రారంభమైన సీనియర్ కుస్తీ పోటీలు
రెండ్రోజుల పాటు జరగనున్న పోటీల్లో భాగంగా మొదటి రోజు సీనియర్ విభాగంలో మహిళలకు, రెండోరోజు సీనియర్ విభాగంలో పురుషులకు పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచన మేరకు కొవిడ్ నెగటివ్ వచ్చిన క్రీడాకారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:చంద్రబాబు కొండపైకి వెళ్లేసరికి గుడికి తాళం వేసిన అధికారులు