తిరుపతి సమీపంలోని కరకంబాడీ పరిధిలోని అడవుల్లో అక్రమంగా తరలిస్తున్న 23 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఒక నిందితున్ని పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగల విలువ రూ.40లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
తిరుపతి అటవీ రేంజి పరిధిలోని కృష్ణాపురం సెక్షన్‌లో కూంబింగ్ నిర్వహిస్తున్న ఎర్రచందనం ప్రత్యేక కార్యదళానికి.. స్మగ్లర్లు తారసడ్డారు. అప్పటికే నరికిన ఎర్ర చందన దుంగలను స్మగ్లర్లు ఎత్తుకెళుతూ.. పోలీసులను గమనించి దుంగలు పడేసి పారిపోయారు.