600 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
చిత్తూరు జిల్లా శ్రీకాళహిస్తిలోని రాజీవ్‌నగర్ కాలనీలో.. అక్రమంగా నిల్వ ఉంచిన 600 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
600 బస్తాల చౌక బియ్యం స్వాధీనం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన చౌక దుకాణాల నుంచి 600 బియ్యం బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలోనే గోదాములో తెల్ల సంచులలో నిల్వ ఉంచి.. బయట ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా.. విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి.. స్వాధీనం చేసుకున్నారు.