ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరు నెలలుగా జీతాలు లేక.. అప్పులవాళ్ల వేధింపులు తాళలేక..? - తిరుపతిలో సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య తాజా వార్తలు

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయం పరిధిలో.. ఆత్మహత్యకు పాల్పడిన సెక్యూరిటీ గార్డ్ ఆఖరి మాటలు... పలువురిని కలచివేస్తున్నాయి. ఆరు నెలలుగా జీతాలు రాకపోవటంతో అప్పుల వాళ్ళ వేధింపులు తాళలేక విషం తగినట్లు పేర్కొన్న సామెల్ వ్యాఖ్యలు వాట్సప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

Security guard Samel commits suicide
సెక్యూరిటీ గార్డ్ సామెల్ ఆత్మహత్య

By

Published : Feb 11, 2021, 5:31 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసిన సామెల్.. ఆత్మహత్య వ్యవహారంలో.. అతడు చెప్పిన ఆఖరి మాటలు విశ్వ విద్యాలయంలో పని చేస్తున్న పొరుగు సేవలు, కాంట్రాక్టు సిబ్బందిని కంట తడి పెట్టిస్తున్నాయి. ఆరు నెలలుగా జీతాలు రాకపోవటంతో అప్పుల వాళ్ళ వేధింపులు తాళలేక విషం తగినట్లు సామెల్ పేర్కొన్నాడు. ఈ మాటలు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను ప్రాణాలు విడిచారు. ఆయన ఆఖరి మాటలు వాట్సాప్ గ్రూప్​ల్లో రావటంపై.. సిబ్బంది తీవ్రంగా స్పందించారు.

నాలుగు, ఐదు నెలలు పెండింగ్​ల్లో జీతాలు...

శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం పరిధిలోని పశు వైద్య కళాశాలలు, పరిశోధన స్థానాలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్క్ కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న వందలాది మందికి సక్రమంగా నెలవారీ జీతాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బంది, వసతి గృహల్లో పని చేస్తున్న సిబ్బందికి నెలకు రూ.7500 జీతమే ఇస్తున్నారు. ఇది కూడా నాలుగు, ఐదు నెలలు పెండింగుల్లో ఉండటం వల్ల 13 సంవత్సరాలుగా పని చేస్తున్న సిబ్బంది.. అప్పులపాలవుతున్నారని వాపోతున్నారు.

ఇవీ చూడండి:

బెడ్​షీట్స్​ మాటున.. ఎర్రచందనం అక్రమ రవాణా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details