ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ముగిసిన సచివాలయ పరీక్షలు

చిత్తూరు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ముగిశాయి. కొవిడ్ జాగ్రత్తలతో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Secretariat Examinations in chittore
చిత్తూరు జిల్లాలో ముగిసిన సచివాలయ పరీక్షలు

By

Published : Sep 20, 2020, 7:29 PM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలు చిత్తూరు జిల్లాలో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా గ్రామ, సచివాలయాల్లో 1873 ఖాళీలుండగా.. వీటికోసం 97 వేల 333 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఒక్క తిరుపతిలోనే 37 కేంద్రాలను ఏర్పాటు చేయగా..చిత్తూరు, మదనపల్లె, కుప్పం సహా మరో 5 మండలాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలనుంచి 12: 30 వరకు.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. కరోనా వైరస్ విస్తృతి ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్ఖులకు అధికారులు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details