ఎస్ఈబీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ... అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీ ప్రాంతాలు, గుట్కా స్థావరాలపై దాడులు చేసి 1,275 కేసులు నమోదు చేసి 1,326 మందిని అరెస్ట్ చేశారు. 38,426 సీసాల మద్యం, 1,960 టెట్రా పాకెట్ల మద్యం, 9,291 లీటర్ల నాటు సారా, 3,89,563 లీటర్ల నాటుసారా ఉటను ధ్వంసం చేశారు. స్వాధీనం చేసుకొన్న మద్యం విలువ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు.
సుమారు 3 వేల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకొని 180 కేసులు నమోదు చేసి 278 మందిని అరెస్ట్ చేసి, 226 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో 101 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.