చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల్లో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో నరసింగాపురం స్వర్ణముఖి వాగులో రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితం రెవెన్యూ అధికారులు సానంపట్ల సమీపంలో రెండు ట్రాక్టర్లను, ఓ జేసీబీ స్వాధీనం చేసుకుని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఇకపై మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలలో తరచూ సోదాలు నిర్వహిస్తామని ఎస్ఈబి అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల్లో ఎస్ఈబీ అధికారుల దాడులు - SEB officers raid on Chandragiri
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల్లో ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటనలో రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
ట్రాక్టర్లు, జెసీబీ స్వాధీనం