ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్ డౌన్ ఎఫెక్ట్: చిత్తైన తుక్కు వ్యాపారం - latest news of corona effect on small scale business persons

పనికిరాని పాత సామాను, చిత్తుకాగితాలు సేకరించి నెట్టుకొచ్చే బతుకుబండి లాక్‌డౌన్‌ దెబ్బకు గాడి తప్పింది. ఆంక్షలు సడలించినా తుక్కు వ్యాపారం ఊపందుకోక అంతతమాత్రం ఆదాయంతో కాలం వెళ్లదీస్తున్నాయి దీన్నే నమ్ముకున్న కుటుంబాలు.

scrap selling bussiness effect  heavily due to corona effect
scrap selling bussiness effect heavily due to corona effect

By

Published : Jun 24, 2020, 7:38 PM IST

కరోనా లాక్‌డౌన్‌తో సంఘటిత, అసంఘటిత అనే తేడాలేకుండా అన్ని రంగాలూ కుదేలయ్యాయి. అభాగ్యులు, అనాథలకు ఉపాధిగా నిలిచిన చెత్త సేకరణపైనా లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. చిత్తూరు జిల్లాలో ఊరూవాడా తిరిగి..... కాగితాలు, చెత్త సేకరించి అమ్ముకుని పొట్టపోసుకునేవాళ్లు.. చాలా మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వారంతా ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేసినా చెత్తసేకరణ ఆశించినంత సాగడంలేదు.

తిరుపతిలో 80 నంచి వంద తుక్కు సేకరణ దుకాణాలుండగా..గతంలో రోజుకు 20నుంచి 30లక్షల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ మేర వ్యాపారమేగగనమైందని వాపోతున్నారు. బేరాలు లేక దుకాణ యజమానులు.. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. మొన్నటివరకూ తిరుపతి సహా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తుక్కును చెన్నైకు తరలించారు. ఇప్పుడు చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించడంతో పరిస్థితి మొదటికొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో రోజంతా కష్టపడితే రోజుకు వంద నుంచి 200 రూపాయలు విలువైన చిత్తు కాగితాలు, ఇతర పనికి రాని సామగ్రి సేకరించే వాళ్లంతా కరోనా ప్రభావంతో భయపడుతూ చెత్త ఏరుకోవాల్సి వస్తోంది. ఇక చాలావరకూ రెడ్‌జోన్లు, కంటైన్మెట్‌ జోన్లు విధించడంతో ఉపాధికి గండిపడిందని చెప్తున్నారు. గతంలో సేకరించిన సామగ్రి కూడా దుకాణాల్లోనే ఉందని దాన్నీ అమ్ముకుని పరిస్థితి లేదని తుక్కు పరిశ్రమపై ఆధారపడినవాళ్లు విచారం వ్యక్తంచేస్తున్నారు.

లాక్ డౌన్ ఎఫెక్ట్: చిత్తైన తుక్కు వ్యాపారం

ఇదీ చూడండి

వైఎస్​ఆర్ కాపు నేస్తాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details