ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూమి లాక్కోవద్దు..10 రోజులుగా కుటుంబం దీక్ష - peddhachllarakunta scs agitation for land

జీవనాధారమైన భూములను లాక్కోవద్దంటూ చిత్తూరు జిల్లా పెద్దచల్లార్ల కుంటలో ఓ కుటుంబం పది రోజులుగా దీక్షకు దిగారు. దళితులమైన తమ భూములే ఇళ్ల స్థలాలకు కేటాయించాలా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమ సమస్యపై స్పందించి.. తాతల కాలం నుంచి సాగు చేస్తున్న తమ భూమికి పట్టాలు ఇప్పించాలని కోరారు.

agitation for land
భూమి కోసం దళితుల ఆందోళన

By

Published : Jul 20, 2020, 10:40 PM IST

తమ భూమిని స్వాధీనం చేసుకొని జీవనాధారాన్ని లాక్కోవద్దంటూ చిత్తూరు జిల్లా పైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లార్లకుంటలో ఓ కుటుంబం పది రోజులుగా దీక్ష చేపట్టింది. గ్రామం సమీపంలో దాదాపు 80 ఏళ్లుగా పోరంబోకు స్థలంలో ఎకరా భూమిని సాగు చేసుకుంటున్నట్లు బాధిత కుటుంబం తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం తమ భూమిని అధికారులు లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిని నమ్ముకొని 40 మంది బతుకుతున్నామనీ... ఈ భూమిని లాక్కొని... మా జీవనాధారాన్ని ప్రశ్నార్థకం చెయ్యెద్దని వేడుకున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి.. తమ సమస్యను తీర్చాలని కోరుతున్నారు. తమ భూమికి పట్టాలివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details