తమ భూముల్లో భూస్వాముల దౌర్జన్యాన్ని ఆపకపోతే ఆత్మహత్యలే శరణ్యమని చిత్తూరు జిల్లా వల్లిగట్టు పంచాయతీ తుమ్మలవడ్డు ఎస్టీ కాలనీకి చెందిన మహిళలు పేర్కొన్నారు. అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సచివాలయంలో సోమవారం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో జిల్లా సచివాలయం పరిపాలనాధికారి మహిళల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
భూస్వాముల దౌర్జన్యాలు ఆపాలని మహిళలు ఆత్మహత్యాయత్నం - చిత్తూరు జిల్లాలో మహిళల ఆందోళన తాజా వార్తలు
తమ పొలాల్లో భూస్వాములు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మహిళలు ఆందోళనకు దిగారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చిత్తూరు జిల్లా వల్లిగట్టు పంచాయతీ తుమ్మలవడ్డు ఎస్టీ కాలనీకి చెందిన మహిళలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని సచివాలయం ఎదుట పెట్రోల్ డబ్బాలతో ఆత్మహత్యాయత్నం చేశారు.
భూస్వాముల ధౌర్జన్యాలు ఆపాలని మహిళలు ఆత్మహత్యాయత్నం
తమ పొలాల్లో మామిడి తోటలను భూస్వాములు నరికి వేరశాని.. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జిల్లా సచివాలయం ఏవో గోపాలయ్య సోమల మండల అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి...