పొలానికి దారి లేకుండా చేశారన్న మానసిక క్షోభతో తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడుకు చెందిన ఓ రైతు వాపోయారు. తమ పొలానికి దారి లేకుండా అగ్రవర్ణాలకు చెందిన రైతులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పొలానికి వెళ్లేందుకు దారి లేదని మానసిక వేదనకు గురై తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన రైతు.. దారి సమస్య విషయమై గతంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి, జిల్లా పాలనాధికారికి వినతులు ఇచ్చారన్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తన తండ్రి చెంగయ్య తీవ్ర ఆవేదనకు గురై, ఆత్మహత్యకు పాల్పడ్డారని వాపోయారు.