ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి రూ.30లక్షల చెక్కు అందజేత - జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఎస్​బీఐ చెక్కు అందజేత

జమ్ముకాశ్మీర్​లో ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన చిత్తూరుకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి... ఎస్​బీఐ రూ.30లక్షల చెక్కును అందజేసింది. బ్యాంకులో ప్రవీణ్ సైనిక ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండటంతో.. బీమా కింద చెక్కును అందించినట్లు బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ రాధాకృష్ణ తెలిపారు.

sbi handovers 30lakhs rupees cheque to jawan praveen kumar reddy family
జవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి రూ.30లక్షల చెక్కు అందజేత

By

Published : Dec 4, 2020, 7:52 PM IST


జమ్మూకాశ్మీర్‌లో జరిగిన తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన... చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఎస్​బీఐ...రూ. 30 లక్షల చెక్కును అందజేసింది. ఎస్​బీఐ‌లో ప్రవీణ్ సైనిక ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండటంతో... బ్యాంకు ఖాతా బీమా కింద రూ. 30 లక్షలు వచ్చినట్లు బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ రాధాకృష్ణ తెలిపారు. వీరమరణం పొందిన ప్రవీణ్‌ కుటుంబానికి స్టేట్‌బ్యాంక్‌ అండగా ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details