అన్నం పెడుతోన్న బ్యాంకుకే కన్నమేసాడో ఘనుడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్ బీఐ బ్యాంకులో బంగారం విలువ చూసే అప్రైజర్ గా పనిచేస్తున్న శివకుమార్,కిలో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి..రూ.18లక్షలు కాజేశాడు.తన కుటుంబ సభ్యులు,స్నేహితుల బ్యాంకు ఖాతాలపై ఈ దుర్మార్గానికి ఒడికట్టినట్లు అధికార్లు గుర్తించారు.శివకుమార్ చేతివాటంపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో,పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.శివకుమార్ కు సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పనిచేస్తోన్న బ్యాంకులోనే అప్రైజర్ చేతివాటం..రూ.18 లక్షలు స్వాహా - చంద్రగిరిలో నకిలీ బంగారం పేరిట చేతివాటం
బ్యాంకులో బంగారం విలువను గుర్తించే అప్రైజర్, తాను పనిచేస్తోన్న బ్యాంకునే బురిడీ కొట్టించాడు. కిలో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఏకంగా రూ.18 లక్షలు కొల్లగొట్టాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా, నిందితుడి చేతివాటం గుర్తించిన బ్యాంకు అధికార్లు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చంద్రగిరి ఎస్ బి ఐ బ్యాంకులో చోటుచేసుకుంది.
ఎస్బీఐ అప్రెజర్ చేతివాటం... 18 లక్షలు స్వాహా
TAGGED:
బ్యాంకు ఉద్యోగి చేతివాటం