చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్‌బీఐ బ్యాంకు శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలోని జంతువులను దత్తత తీసుకుంది. జంతు ప్రదర్శన శాలలో ఉన్న ఒక పులి, చిరుత, సింహాన్ని దత్తతగా తీసుకున్నారు. ఎస్‌బీఐ ఏడాదిపాటు వాటికి అవసరమైన ఆహారం, మందులు అందివ్వనుంది. దీనికోసం 15 లక్షల రూపాయలను ఎస్వీ జూ క్యూరేటర్ హిమ శైలజకు అధికారులకు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అందజేశారు.
పులి, చిరుత, సింహాన్ని దత్తత తీసుకున్న ఎస్‌బీఐ - తిరుపతి ఎస్వీ జంతుప్రదర్శనశాల తాజా వార్తలు
చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలోని జంతువులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి శాఖ దత్తత తీసుకుంది. ఏడాదిపాటు వాటికి అవసరమైన ఆహారం, మందులు అందివ్వనుంది.

ఎస్వీ జంతుప్రదర్శనశాలలోని జంతువులను దత్తత తీసుకున్న ఎస్‌బీఐ