ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన సమయంలో ఉన్న పరిస్థితులే కథాంశంగా రణరంగం చిత్రాన్ని రూపొందించామని హీరో శర్వానంద్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం చిత్ర దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి తిరుపతి వచ్చారు. కాసేపు మీడియాతో మాట్లాడారు. చిత్రానికి సంబంధించిన విషయాలను తెలియచేశారు. ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా మాస్ జోనర్ లో నటించిన ఈ చిత్రం...తనకు ప్రత్యేకమైందని శర్వానంద్ తెలిపారు. ఆగస్టు 15న విడుదలవుతున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తరువాత తమిళ్ 96 రీమేక్ లో నటిస్తున్నానన్నారు. శర్వానంద్ నటనకు పరీక్ష పెట్టేలా రెండు పాత్రల్లో ఆయన అలరించనున్నారని దర్శకుడు సుధీర్ వర్మ తెలియచేశారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా వస్తున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు.
ఎన్టీఆర్ హయాంలోని మద్యపాన నిషేధ అంశమే.. 'రణరంగం' - sudheer varma
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నటుడు శర్వానంద్ తిరుపతి వచ్చారు. మీడియాతో ముచ్చటించారు.
రణరంగం