చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో.. సర్పంచి అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఓటరు స్లిప్పులపై గుర్తులు రాసి పంపిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ మద్దతు గుర్తులు వేసి పంపిస్తున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అధికార పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థికి మేలు చేసేలా జరుగుతున్న ఈ ప్రక్రియపై.. ఆర్వోకు ఫిర్యాదు చేశామని.. అయినా గుర్తులు రాసిన స్లిప్పులు వస్తూనే ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓటరు స్లిప్పులపై పార్టీ మద్దతు గుర్తులు.. అభ్యర్థుల ఆందోళనలు - panchayat elections in chittor
ఓటరు స్లిప్పులపై అధికార పార్టీ మద్దతు గుర్తులు వేసి పంపిస్తున్న ఘటన.. చిత్తూరులోని కమ్మకండ్రిగలో జరిగింది. దీంతో సర్పంచి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని..సర్పంచి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021