ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేధింపులు భరించలేక సంఘమిత్ర ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

ఉద్యగం నుంచి తొలగించారని సంఘమిత్ర ఉద్యోగిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన.. చిత్తూరు జిల్లా నిమ్మలపల్లిలో జరిగింది. తనను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారో తెలపాలని కార్యాలయానికి వెళ్లిన బాధితురాలు.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తనను ఉద్యోగం నుంచి తీసివేయటానికి స్థానికులైన నలుగురు వ్యక్తులే కారణమని లేఖ రాసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

women suicide attempt
సుంఘమిత్ర ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 5, 2021, 8:02 PM IST

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో విజయలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. విజయలక్ష్మి సంఘమిత్ర ఉద్యోగినిగా పనిచేసింది. సుమారు రెండు నెలల క్రితం తనను ఉద్యోగం నుంచి తొలగించగా.. ఆ విషయమై కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించింది. పురుగుల మందు వెంట తీసుకెళ్లిన ఆమె తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన తోటి సిబ్బంది ఆమెను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు.

నలుగురు వ్యక్తులు వేధిస్తున్నారంటూ లేఖ

ఆత్మహత్యా యత్నానికి ముందు బాధితురాలు.. తనను స్థానికులైన నలుగురు వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారని లేఖ రాసింది. తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి కారణం వారేనని లేఖలో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

శిథిలావస్థకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు.. పట్టించుకునే వారే లేరా?

ABOUT THE AUTHOR

...view details