ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా - Officers of the Special Enforcement Bureau

చంద్రగిరి మండలంలోని స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.

chittor district
చంద్రగిరిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా..

By

Published : Jun 25, 2020, 6:49 AM IST

చిత్తూరు జిల్లాలోని నదీపరివాహక ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చంద్రగిరిలో ఇసుక మాఫియాపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేపట్టారు. తొండవాడ వద్ద స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేశారు. ట్రాక్టర్లను చంద్రగిరి పోలీస్ స్టేషన్​కు తరలించి కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.
ఇది చదవండిలాక్ డౌన్ ఎఫెక్ట్: చిత్తైన తుక్కు వ్యాపారం

ABOUT THE AUTHOR

...view details