ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు - latest news of sand seez in chittoor dst

చిత్తూరు జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 టిప్పర్లను సీజ్ చేసినట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

sand seized in chittoor dst sathayvedu consistency
sand seized in chittoor dst sathayvedu consistency

By

Published : May 22, 2020, 4:17 PM IST

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలం అరుణానది నుంచి... అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రిశాంత్ రెడ్డి సీజ్ చేశారు. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో... యథేచ్ఛగా ఎలాంటి ఆన్లైన్ బిల్లు లేకుండా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అందించిన సమాచారం మేరకు ఎస్పీ రిశాంత్ రెడ్డి తన బృందంతో దాడులు నిర్వహించారు. 4 టిప్పర్లు, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details