కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆంక్షలు కఠినతరం చేశారు. పట్టణాన్ని మొత్తం రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చామని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. అత్యవసర వస్తువులు కావాల్సిన వారికి నేరుగా ఇంటికి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. నిత్యావసరాల కోసం 9849907502, 9849907505, 9100929873 నెంబర్లకు ఫోన్ చేయాలని...ఆరోగ్య అవసరాల కోసం 8008553660 నెంబర్‌కు కాల్ చేయాలని వివరించారు. కేవలం లక్ష జనాభా ఉన్న శ్రీకాళహస్తిలో 47 పాజిటివ్ కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. శ్రీకాళహస్తి నుంచి ఉద్యోగుల రాకపోకలపై నిషేధం విధించామని..పరిసర ప్రాంతాల్లోని మరో ఏడు మండలాలు రెడ్ జోన్ లోకి తీసుకువచ్చామని తెలిపారు. జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదముందన్నారు. ప్రతి వ్యక్తి ఇంటికే పరిమితం కావాలని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిచామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీకాళహస్తిలో ఆంక్షలు మరింత కఠినం - lockdown in Srikalahasti
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆంక్షలు మరింత తీవ్రతరం చేసినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు. శ్రీకాళహస్తి పట్టణాన్ని మొత్తం రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చామని అన్నారు. నిత్యావసరాల కోసం 9849907502, 9849907505, 9100929873 నంబర్లకు ఫోన్ చేయాలని...ఆరోగ్య అవసరాల కోసం 8008553660 నెంబర్‌కు కాల్ చేయాలని వివరించారు.
శ్రీకాళహస్తిలో ఆంక్షలు మరింత తీవ్రతరం