మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఫొటోగ్రఫీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు అన్నారు. స్థానిక ఎస్వీ విశ్వవిద్యాలయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫి వర్క్ షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ గురు చరణ్....కార్యక్రమంలో ఔత్సాహికులకు మెళకువలు నేర్పించారు. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న తిరుపతి అందాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యశాలను ఏర్పాటు చేశామని విజయరామరాజు అన్నారు. నవయుగ ఫొటోగ్రాఫర్ల బృందం ఈ వేదికను సద్వినియోగపర్చుకోవాలని కోరారు.
తిరుపతిలో.. స్మార్ట్ సిటీ ఫొటో వర్క్‌షాప్ - ap latest
తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫి వర్క్ షాప్‌కు మంచి స్పందన లభించింది. ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు హాజరయ్యారు. ప్రముఖ ఛాయచిత్ర నిపుణుడు గురుచరణ్ ఔత్సాహికులకు నైపుణ్య సూత్రాలు వివరించారు.
ఇక స్మార్ట్‌గా తిరుపతి అందాలు బంధిస్తాం